Home Telangana పాలకులు మారినా పరిస్థితుల్లో నో చేంజ్..

పాలకులు మారినా పరిస్థితుల్లో నో చేంజ్..


ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న రివేంజ్.
అధికార కేంద్రం చుట్టూ తెలంగాణ దారులు.
రాజకీయ ముఖచిత్రం మార్చనున్న ప్రెజర్ గ్రూపులు.


తెలంగాణ ఇప్పుడు మరో కీలక రాజకీయ మలుపు ముందు నిలబడింది. అధికారం ఎవరిది అన్నది మాత్రమే కాదు.. తెలంగాణ ఎవరిది అన్న ప్రశ్న మళ్లీ గుండెల్లో గర్జిస్తోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతోంది. మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ తిరిగి పీఠం దక్కించుకుంటామని నమ్మకం ప్రకటిస్తోంది. బీజేపీ మాత్రం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతోంది. ఈ మూడు పార్టీల పోటీకి మించి ఇప్పుడు మరో స్వరం బలపడుతోంది. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ల తెలంగాణ ఎక్కడ? ఉద్యమంలో రక్తం చిందించిన యువతకు ఏం దక్కింది? ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరానికి ఎవరు జవాబు చెబుతారు? తెలంగాణ వనరులపై మొదటి హక్కు తెలంగాణ ప్రజలదే కాదా? అన్న ప్రశ్నలు రాజకీయ వేదికలపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు ఈ ప్రశ్నలను గట్టిగా లేవనెత్తితే, కాంగ్రెస్‌లోనే ప్రెజర్ గ్రూపులతో… తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారే అవకాశం కన్పిస్తోంది. కేసీఆర్ మళ్లీ రావాలన్న బీఆర్ఎస్ ఆకాంక్ష, రేవంత్ దీర్ఘకాల పాలన లక్ష్యం, బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహం, కవిత కొత్త రాజకీయ ఆలోచనలు.. ఇవన్నీ ఒకవైపు ఉంటే… తెలంగాణ దొరలెవరు.. దొంగలెవరు.. అన్న ట్యాగ్‌లైన్… తెలంగాణ గుండె స్వరం మరోవైపు నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ స్వరం ఎవరిని నిలబెడుతుంది? ఎవరిని కూలదోస్తుంది? ఇదే తెలంగాణ రాజకీయాల అసలు కథ. అయితే ఇక పదండి… చదవండి..!

 

#TelanganaPolitics #TelanganaPolitics2026 #RevanthReddy #KCR #BRS #Congress #BJP #TelanganaBJP #TelanganaCongress #TelanganaPressureGroups #TelanganaYouth #PublicAnger #TelanganaElections #RajagopalReddy #Kavitha #TelanganaPoliticalBattle #TelanganaPoliticalAnalysis #TelanganaNews #TelanganaFuture #PoliticalPressureGroups