రన్ మెషీన్ మళ్లీ గర్జించింది.. బ్యాట్ నుంచి వచ్చిన 270 పరుగులు బీసీసీఐ సెలెక్టర్లకు గట్టి సందేశంగా మారాయి. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్‌పై ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర డబుల్ సెంచరీతో తన పునరాగమనాన్ని మరింత బలంగా చాటాడు. ఒకప్పుడు టీమిండియాలో మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఉన్న ఇషాన్.. అనూహ్య పరిణామాలతో జట్టుకు దూరమై, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అక్కడి నుంచి వెనక్కి తగ్గకుండా దేశవాళీ క్రికెట్లో చెమటోడ్చాడు. రంజీ ట్రోఫీలో సెంచరీలు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 517 పరుగులు, రెండు శతకాలతో తన బ్యాట్‌కు పదును పెట్టాడు. ఇప్పుడు దులీప్ ఫైనల్లో 270 పరుగులతో మరోసారి సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్ వెనుక పరుగుల కంటే పెద్ద కథ అతని మారిన మైండ్‌సెట్. ఓవర్ థింకింగ్, అంచనాలకు దూరంగా.. బంతిని చూడటం, స్పందించడం, పరుగులు చేయడమే తన పని అని ఇషాన్ చెబుతున్నాడు. ఫైనల్లో భాగస్వామ్యాలపై దృష్టి పెట్టి ఒక్కో అడుగు ముందుకు వేసిన అతడు ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేశాడు. దాదాపు రెండేళ్ల దేశవాళీ పోరాటం తనకు ఆటను మళ్లీ నేర్పిందని చెప్పిన ఇషాన్.. ఇప్పుడు కేవలం తిరిగి రావడం కాదు, టీమిండియా తలుపు బలంగా తడుతున్నాడు.
#IshanKishan #IshanKishan270 #IshanKishanComeback #DuleepTrophy #DuleepTrophyFinal #IshanKishanDoubleCentury #TeamIndia #BCCI #BCCISelectors #IndianCricket #DomesticCricket #EastZone #SouthZone #IshanKishanBatting #TeamIndiaComeback #IshanKishanNews #RanjiTrophy #SyedMushtaqAliTrophy #CricketNews #DuleepTrophy2026











