Home Telangana 22ఏ అక్రమాలపై న్యాయవిచారణ జరపాలి

22ఏ అక్రమాలపై న్యాయవిచారణ జరపాలి

భూ అక్రమాలపై సర్కారుపై కేటీఆర్‌ ఫైర్.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణలో భూముల వ్యవహారంపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 22ఏ జాబితాలో ప్రజల ఆస్తులను చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 30 శాతం కమీషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లను నిషేధిత జాబితా నుంచి ఎలాంటి షరతులు లేకుండా తొలగించి, ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని అన్నారు. ధరణి ప్రజలకు రక్షణ కవచంలా ఉండేదని, ఇప్పుడు భూభారతి పేరుతో ‘భూ హారతి’గా మార్చేశారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ వస్తుంది

అసైన్డ్‌ భూముల విషయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కేటీఆర్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీలకు యాజమాన్య హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని విమర్శించారు. 22ఏ వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. భూముల విషయంలో సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని చెప్పారు. రెండేళ్లలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటివరకు జరిగిన భూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, అన్ని అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తామని ప్రకటించారు.

 

#KTR #KTRNews #KTR22ALands #22ALands #22ALandIssue #22AProhibitedLands #TelanganaLandIssue #KTRJudicialProbe #JudicialProbe #BRS #BRSWorkingPresident #RevanthReddy #CongressGovernment #BhuBharati #Dharani #LandRecords #LandDispute #PropertyRights #TelanganaPolitics #BRSNews #KTRComments #HarishRao #TelanganaNews #PoliticalNews