సీఎంతో విభేదాలపై పీసీసీ చీఫ్ క్లారిటీ.
టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమేనని, ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చినా అదే రోజు సాయంత్రానికే పరిష్కరించుకున్నామని తెలిపారు. రేవంత్‌రెడ్డి పార్టీ వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. గత రెండేళ్లలో బూత్ స్థాయి వరకు కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కట్టుబాటుతో పనిచేశానని చెప్పారు. రాహుల్‌గాంధీని దేశ ప్రధానిగా చూడటమే రేవంత్‌రెడ్డితో కలిసి తమ ప్రధాన లక్ష్యమని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కులగణనపై కీలక హామీ
తెలంగాణలో నిర్వహించిన కుల సర్వే సామాజిక న్యాయానికి దోహదపడిందని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల సర్వే అంశాన్ని పక్కన పెట్టడం బాధాకరమని, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల సర్వేను అమలు చేస్తామని తెలిపారు. మరోవైపు మంత్రి కొండా సురేఖపై పార్టీ తీసుకున్న చర్యపై తాను బాధపడ్డానని చెప్పారు. అయితే ఏఐసీసీ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడిగా అమలు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నాయకుడి స్థాయి లేదా ప్రభావంతో సంబంధం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
#MaheshKumarGoud #MaheshGoud #RevanthReddy #TPCC #TPCCChief #TelanganaCongress #Congress #TelanganaPolitics #RevanthReddyMaheshGoud #NoDifferences #NoGap #CongressPolitics #CasteSurvey #TelanganaCasteSurvey #CasteCensus #SocialJustice #KondaSurekha #CongressDiscipline #TelanganaNews #PoliticalNews #TPCCNews #CongressTelangana











