భారత్–జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు క్రికెట్ వేదిక కానుంది. సెప్టెంబర్ 22న జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్–జపాన్ మధ్య తొలి పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. సుజుకి కప్‌లో భాగంగా జరిగే ఈ వన్డే మ్యాచ్ ఇరు దేశాల క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది. జపాన్‌తో టీ20 ఆడటం భారత్‌కు ఇదే తొలిసారి. జపాన్ ప్రధాని సనాయే తకాయిచి, భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశంలో కుదిరిన ఒప్పందం నుంచి ‘స్పోర్ట్ 75’ కార్యక్రమం రూపుదిద్దుకుంది. 2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం లక్ష్యంగా ఇరు దేశాల క్రీడా సహకారాన్ని పెంచడమే దీని ఉద్దేశం. ఈ మ్యాచ్‌తో జపాన్, తూర్పు ఆసియాలో క్రికెట్‌ను విస్తరించేందుకు బీసీసీఐ ప్రయత్నించనుంది. ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో ఆడటం తమకు చారిత్రక ఘట్టమని జపాన్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. జపాన్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 41వ స్థానంలో ఉంది. ఇండియాకు టీ20ల్లో ప్రత్యర్థిగా నిలిచే 20వ జట్టు జపాన్ కానుంది.
#IndiaVsJapan #IndiaJapanCricket #FirstT20I #T20International #JapanCricket #IndianCricket #CricketDiplomacy #IndiaJapanRelations #75YearsDiplomaticTies #Sport75 #BCCI #JapanCricketAssociation #SuzukiCup











