మరో మైలు చేరుకున్నామన్న దీమా .
ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రచారం.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ మరో కీలక మైలురాయిని సాధించిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘ఇంటింటికి తెలుగుదేశం-2026’ కార్యక్రమం కోటి ఇళ్లకు చేరుకోవడం గొప్ప విజయమని అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమగ్రంగా వివరించిన తీరు ఆకట్టుకుందని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కేవలం ప్రచారం చేయడం కాకుండా.. వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించడంపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టడం అభినందనీయమని అన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి చేరవేత
‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా కోటి ఇళ్లకు వెళ్లడంతో పాటు.. ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను కూడా పార్టీ శ్రేణులు సేకరించాయని లోకేశ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు చెప్పిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ద్వారా పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే అవకాశం ఏర్పడిందన్నారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల స్పందనను తెలుసుకోవడంతో పాటు.. స్థానికంగా అవసరమైన అభివృద్ధి పనులపై కూడా సమాచారం సేకరించామని పేర్కొన్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వం.. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు అనే విధంగా ఈ కార్యక్రమం కొనసాగిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. కోటి ఇళ్లను చేరుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ కుటుంబానికి తన కృతజ్ఞతలు తెలియజేస్తూ.. పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
#TDP #IntintikiTeluguDesam #IntintikiTeluguDesam2026 #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #APPolitics #TDPCampaign #WelfareSchemes #Development #DoorToDoorCampaign #CoalitionGovernment #PublicOutreach #APNews #PoliticalNews











