తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై స్పందించారు. లండన్‌లో తనకు లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందించిన బలమైన మద్దతును ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఖర్గే తనకు అండగా నిలిచారని, పార్టీ నేతలు, దేశవ్యాప్తంగా ప్రజలు కూడా మద్దతు తెలిపారని రేవంత్ పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. లండన్‌లో ఇప్పటికే నిర్ణయించిన అన్ని సమావేశాలు, కార్యక్రమాలను పూర్తి చేసుకున్నానని వెల్లడించారు. గత మూడు రోజులుగా లండన్‌లో తనకు లభించిన అపూర్వమైన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. అసలు షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి బోస్టన్ వెళ్లాల్సి ఉండగా, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా పర్యటనకు ‘రాజకీయ కారణాలతో’ అనుమతి నిరాకరించడంతో ఇక నేరుగా హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు వెల్లడించారు. మరికొద్ది గంటల్లో స్వదేశానికి బయలుదేరనున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ, దాని వెనుక కారణాలు, కేంద్రం వైఖరిపై హైదరాబాద్ చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సీఎం అమెరికా పర్యటన రద్దు అంశం తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
#RevanthReddy #TelanganaCM #USVisit #AmericaTour #RevanthReddyUSVisit #MallikarjunKharge #Congress #TelanganaPolitics #LondonVisit #PoliticalClearance #CentreVsTelangana #CongressTelangana #RevanthReddyNews #TelanganaNews #IndiaPolitics











