హైదరాబాద్ మేడ్చల్‌లో జరిగిన ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నలుగురు గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో నటుడు యశ్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో సౌండ్ బాక్స్ వ్యవస్థకు సంబంధించిన స్టాండ్ ఒక్కసారిగా కూలిపోయింది. మెరుగైన దృశ్యం కోసం కొందరు అభిమానులు సౌండ్ సిస్టమ్ స్టాండ్‌పైకి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
నలుగురికి గాయాలు.. విద్యార్థికి ఫ్రాక్చర్
స్టాండ్ కూలిపోవడంతో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరు విద్యార్థి కాగా, ఆయన కాలికి ఫ్రాక్చర్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న వారి కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈవెంట్ నిర్వహణలో భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల బాధ్యతపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
యశ్ ప్రసంగం రెండుసార్లు నిలిపివేత
ప్రమాదం గురించి తెలుసుకున్న యశ్ వెంటనే తన ప్రసంగాన్ని నిలిపివేసి గాయపడిన వారికి సహాయం అందించాలని నిర్వాహకులను కోరారు. “వాళ్లు బాగున్నారా? ముందు చూసుకోండి” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఇతర అభిమానులు మరో సౌండ్ స్టాండ్‌పైకి ఎక్కడాన్ని గమనించిన యశ్ మరోసారి కార్యక్రమాన్ని ఆపేశారు. ప్రమాదం నేపథ్యంలో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. యశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
#LokSabha #LokSabhaProrogation #Congress #JairamRamesh #Parliament #MonsoonSession2026 #DelimitationBill #AmitShah #IndianParliament #Article85 #Delimitation #ParliamentSession #PoliticalControversy #CongressParty #IndiaPolitics











