లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి తెలుగు ఎన్నారైలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి నిర్వహించిన ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులు, రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలపై ఎన్నారైలతో సీఎం ముచ్చటించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు సమాజం తెలంగాణకు బలమైన భాగస్వామిగా నిలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రవాస తెలంగాణవాసులు క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని కోరారు. ‘తెలంగాణ రైజింగ్’కు ఎన్నారైలు అంబాసిడర్లుగా వ్యవహరించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, ఐటీ రంగంలో అభివృద్ధి వంటి అంశాలను ప్రపంచానికి చాటడంలో ప్రవాసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగు సమాజంతో తెలంగాణకు ఉన్న అనుబంధం రాష్ట్రానికి ఎంతో బలమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను ప్రపంచానికి చేరువ చేయడంతో పాటు ప్రపంచ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఎన్నారైల సహకారం అవసరమని సీఎం స్పష్టం చేశారు.
#RevanthReddy #TelanganaRising #Telangana #London #NRIs #TeluguNRIs #TelanganaInvestments #TelanganaDevelopment #SridharBabu #ITIndustry #GlobalInvestments #TelanganaDiaspora #NRIInvestments #TelanganaPolitics #LondonVisit











