Home Naadesam_Special 26.07.2026 -01.08.2026 వరకు వార ఫలితాలు

26.07.2026 -01.08.2026 వరకు వార ఫలితాలు

Weekly Horoscope July 26 – August 1, 2026

శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యోనమః 26.07.2026 -01.08.2026 వరకు వార ఫలితాలు

మేషరాశి : విదేశ విద్యకు చేసే అన్ని రకాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెళ్లిచూపులు కళ్యాణ మండపం బుక్ చేసే స్థితికి తీసుకెళ్తుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కు లక్ష్మీ కటాక్షం కలుగును. రేప్రజెంట్స్ కు ఉద్యోగ మార్పు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రక్తసంబంధీకులతో సఖ్యత పెంచుకోగలరు. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. కోర్టు తీర్పు అనుకూలం. వృద్ధులు సకాలంలో వైద్యున్ని సంప్రదించటం వలన ఆయుష్ వృద్ధి అగును. విదేశాలలో నివసిస్తున్న వారికి ఉద్యోగ మార్పునకు ఆస్కారం ఉంది. షేర్ మార్కెట్ లభిస్తుంది. వ్యాపారస్తులు పోటీ తత్వంతో వ్యాపారం చేయటం వలన ఆర్థిక పుష్టి కలుగును. 30,31,01 ఆగస్టు తేదీలు అనుకూలం. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం వలన మేలు జరుగుతుంది. సూర్య ద్వాదశ నామాలు పారాయణ చేయగలరు.

వృషభ రాశి : నిరుద్యోగులకు కాంట్రాక్ట్ బేసిక్ కలిగిన ఉద్యోగం వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు ఆస్కారం ఉంది. వృద్ధులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తమ అధికారుల సమన్వయంతో పనిచేయటం చెప్పదగు సూచన. గృహిణులు హుందాగా వ్యవహరించకపోతే అవమానాలను పొందాల్సిన పరిస్థితి రావచ్చు. వ్యవసాయదారులకు నిరాశాజనకమే. సమయపాలన చేస్తూ పనులను పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోగలరు. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. విద్యార్థులు శ్యామల దండకాన్ని పారాయణ చేయగలరు. సమాజంలో ఉన్న పెద్దవారితో పరిచయాలు పెరగటం వలన మానసిక ధైర్యం పెరుగుతుంది. 26వ తేదీ ఆదివారం ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవటం మంచిది. బుధవారం పౌర్ణమితి యందు తల్లిదండ్రులుగా ఉన్న గురువులకు పాదానికి నమస్కరించుకోవటం, దక్షిణామూర్తిని దర్శించటం, రావి చెట్టు ప్రదక్షిణ మేలు చేస్తాయి.

మిధున రాశి : తీవ్ర ప్రయత్నం చేస్తూ దైవ శక్తిని పెంచుకొని ప్రయత్నిస్తే ప్రేమకు పెద్దలు అంగీకరిస్తారు. విదేశ విద్యను అభ్యసించాలనుకునే వారికి చివరి నిమిషంలో నైనా ప్రయత్నాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విలేఖర్ల ప్రావీణ్యాన్ని వారి అధికారులు గుర్తిస్తారు. వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రాకపోవచ్చు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉండును. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువ ఆలోచిస్తే నిద్రలేమికి ఆస్కారం ఉన్నది.29,31 తేదీల యందు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోగలరు. సూర్య ద్వాదశ నామాలను పారాయణ చేయటం, సుబ్రహ్మణ్యస్వామి కవచాన్ని పారాయణ చేయటం వలన మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి: మిత్రుడైనప్పటికీ వ్యవహారం సందర్భంలో కాగితంపై పై అగ్రిమెంట్ రాయించుకోవటం ఇద్దరికీ మంచిది. నూతన వాహనము కొనుగోలుకు ఆస్కారం ఉంది. గృహ నిర్మాణ విషయంలో అతి విశ్వాసం తగ్గించుకొని సొంత పర్యవేక్షణ అవసరం అని భావించగలరు. ఉద్యోగస్తులకు పదోన్నతి వస్తుంది. ఆర్థిక సర్దుబాట్లు అవుతాయి. తల్లి తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ వహించగలరు. విద్యార్థులకు అనుకున్న బ్రాంచీలలో సీటు వచ్చే ఆస్కారం ఉంది. భార్యాభర్తలు సఖ్యతగా ఉండటం వల్ల ఏదైనా సాధించగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు అనుకూలం. రుణాలు తీర్చగలుగుతారు.31 వ తారీకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోగలరు. సూర్యాష్టకం పారాయణ లక్ష్మీ గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన గ్రహదో ష తీవ్రత తగ్గును. మారేడు మొక్క ను నాటి సంరక్షించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగును.

సింహరాశి: తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. భార్య ఆరోగ్యం పై శ్రద్ధ వహించగలరు. బయట ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం చేయవచ్చు. వృత్తిపరమైన ప్రయాణాలు ఉంటాయి. జ్వర సంబంధ అనారోగ్యం పట్ల శ్రద్ధ వహించగలరు. విద్యార్థులు ఎంచుకున్న కాలేజీలో సీటు రాకపోవచ్చు. అతి విశ్వాసం పక్కనపెట్టి మర్యాదపూర్వకంగా మాట్లాడి పనులు సానుకూలంగా చేసుకోగలరు. వ్యసనాలకపోతే డబ్బు- ఆరోగ్యం కోల్పోవాల్సి వస్తుంది. తొందరపడి ఆస్తులు అమ్మితే నష్టపోతారు సుమా! వాదనలకు పోవద్దు. రావి మొక్క నాటి సంరక్షించడం వలన మేలు జరుగుతుంది. గురువారం శనగలు దానం చేయగలరు. గురు చరిత్ర పారాయణ గ్రహదోష తీవ్రత తగ్గించగలదు.

కన్యారాశి : వ్యాపారం సామాన్యంగా ఉండును అయితే టాక్స్ అధికారుల నోటీసుల కు జవాబు చెప్పాల్సిన పరిస్థితి గమనించవచ్చు. ఎవరి విషయాలు కల్పించుకోకుండా మితంగా మాట్లాడటం చెప్పదగు సూచన. ముఖ్యమైన పనులను బంధువులకు అప్పగిస్తే ఆ పని సక్రమంగా పూర్తి కాక పో వచ్చు. దగ్గర బంధువుల నుండి దుర్వార్త వినవచ్చు. గృహిణుల మనోవాంఛ నెరవేరును. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు మీ వద్దకే వెతుక్కుంటూ వస్తాయి. రుణాలు తీర్చేందుకు అనుకూలంగా ఉంది. మగవారు అదృష్టాన్ని కంటే కష్టాన్ని నమ్ముకోండి మేలు జరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. లక్ష్మీ చతుర్వింశతి నామాలను పారాయణ చేయడం వలన గోమాత సేవ వలన గ్రహదోష తీవ్రత తగ్గును.

తులా రాశి : ధైర్యం చేసి పనులు చేపడితే అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ పట్టుదలకు, వివాదాలకు దూరంగా ఉండండి. శ్రమపడి జీవించే అన్ని రంగాల వారికి ఆర్థిక అభివృద్ధి కలుగును. గృహ మనమత్తులు అనుకూలిస్తాయి. ఆర్థిక పుష్టి ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం వలన పని భారం పెరుగును. నిరుద్యోగులకు ప్రస్తుతం జీతం తక్కువైనా మంచి ఉద్యోగమే లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టర్లకు లక్ష్మీ కటాక్షం కలుగును. మంగళవారం సాయంకాలం శివాలయంలో అర్చన చేయించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ గ్రహదోష తీవ్రత తగ్గించును. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి : విదేశ విద్య కోరుకునే వారికి వీసా వస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనానికి ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామి చేసే ప్రయత్నాలు అనుకొనిస్తాయి. తొందరపాటు తనం తగ్గించుకోగలరు. ఆకస్మిక ప్రయాణాలకు ఆస్కారం ఉంది. ఆన్లైన్ కొనుగోళ్ల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంది సుమా! రుణ సదుపాయం కలుగును. తల్లి ఆశీస్సులు తీసుకోవడం వలన పనులు లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడి భారంగా మారును. విష్ణు సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయడం వలన గ్రహదోష తీవ్రత తగ్గును. పెసలు దానం చేయండి.

ధనస్సు రాశి : ఇంటి ఆహారము ఆరోగ్యాన్నిస్తుంది. అవమానాలను తట్టుకొని జీవించాల్సిన పరిస్థితి గమనిస్తారు. ఒకటికి రెండుసార్లు వెళితే పనులు అవుతాయి. రక్తసంబంధీకుల పట్ల సఖ్యత పెంచుకోవాలి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. చిన్న చిన్న అవమానాలను పట్టించుకుంటే పనులు ముందుకు సాగవు అని గ్రహించగలరు. కోర్టు కేసులు వాయిదా వేసుకోవటం మంచిది.26,27,28 తేదీలు అనుకూలం. కాలభైరవాష్టకాన్ని పారాయణ చెయ్యగలరు. శమీ మొక్కను నాటి సంరక్షించడం వలన గ్రహదోష తీవ్రత తగ్గును.

మకర రాశి: విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. ఆరోగ్యం కొంచెం నలతగా ఉన్నా లెక్క చేయక కార్యసాధకులుగా ముందుకు సాగుతారు. వ్యాపారస్తులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు ఈ కారణంగా మీ అవసరాలకు తగినట్లుగా డబ్బు చేతికి అందుతుంది. చేసే వృత్తిలో కష్టం ఎక్కువగా ఉన్న ఆర్థిక పుష్టి కలుగుతుంది. మిత్రులతో బంధువులతో సఖ్యతగా ఉండటం వలన ఆపదలో ఆదుకుంటారు అని గ్రహించగలరు. ప్రజా జీవనంలో ఉండే వారికి చిన్న పదవీ బాధ్యత లభించే ఆస్కారం ఉంది.29,30 తేదీలు అనుకూలం. సూర్య నమస్కారము లక్ష్మీ అష్టకము పారాయణ మేలు చేస్తాయి.

కుంభరాశి : ఉద్యోగస్తులు పట్టుదలకు పోకుండా ఉంటే ఈ వారం అంతా మంచి రోజులే. కుటుంబ ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనముకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించగలరు. క్రీడాకారులకు అనుకూలం. వ్యాయామము పట్ల శ్రద్ధ వహిస్తారు. షేర్ మార్కెట్ ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. గృహిణులు తొందరపాటు తనం తగ్గించుకుంటే అన్నీ మంచి రోజులే. సంతాన అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యరంగ విద్యార్థులకు అనుకూలం. డ్రైవింగ్ స్పీడ్ తగ్గించుకోవడం మంచిది. వ్యాపార విస్తరణకు అనుకూలం. విద్యార్థులకు కష్టం మీద మీరు అనుకున్న కాలేజీలో సీటు వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటే ఈ వారం అంతా మంచి రోజులే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. విద్యార్థులు శ్యామల దండకాన్ని పారాయణ చేయండి.

మీన రాశి : చేపట్టిన పనిని ఓర్పుతో పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సర్దుబాటులకు అనుకూలం. విద్యార్థులకు మనోవాంఛ నెరవేరును. స్థిరాస్తి కొనుగోలుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కళా రంగంలో ఉండే వారికి వారాంతంలో అవకాశాలు వస్తాయి. బీదవారిని ఆదరిస్తారు. కుటుంబ పరమైన సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. 31,01 ఆగస్టు తేదీలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తాయి. ఏలినాటి శని దోషంగా ఉంది కాబట్టి బీదవారికి పెరుగన్నం పెట్టండి. శని వజ్రపంజర కవచాన్ని పారాయణ చేయగలరు. రుద్రాభిషేకం చేయించండి.


టీటీడీ అనుబంధ సంస్థ సమరసత సిద్ధాంతి దైవజ్ఞ పులిపాక చంద్రశేఖర శర్మ శ్రీ చక్ర పంచాంగ కర్త 9440783005