Home Naadesam_Special అందరి ఫోకస్ ఆ ఇద్దరిపైనే.. పవన్‌తో రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

అందరి ఫోకస్ ఆ ఇద్దరిపైనే.. పవన్‌తో రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

ఆ రోజులు గుర్తు చేసుకున్న నేతలు

మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారానికి సంబంధించిన అంశాలను ఇరువురూ గుర్తుచేసుకున్నారు. అనంతరం సమకాలీన రాజకీయ పరిణామాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక ఎన్నికలపై జనసేన ఇప్పటికే సన్నాహాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అధ్యక్షుడి సూచనలతో స్థానిక ఎన్నికల కోసం కమిటీలు, సమన్వయ వ్యవస్థలను జనసేన ఏర్పాటు చేస్తోంది. పవన్‌ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత స్నేహాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ భేటీ సుమారు కొంతసేపు కొనసాగింది.

 

#PawanKalyan #VangaveetiRadhaKrishna #JanaSena #PrajaRajyam #APPolitics #APLocalElections #LocalBodyElections #AndhraPradesh #VijayawadaWest #PoliticalMeeting #PawanKalyanNews #RadhaKrishna #JanaSenaParty #APNews #LocalPolls