Home General కాక్రోచ్‌ల జోలికి వెళ్తే కష్టమే? వేణుస్వామి సంచలన జోస్యం

కాక్రోచ్‌ల జోలికి వెళ్తే కష్టమే? వేణుస్వామి సంచలన జోస్యం

కమలానికి బొద్దింకల గండం.
సీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు.

జాతకాలతో సంచలనాలు సృష్టించడం… జోస్యాలతో సోషల్ మీడియాను షేక్ చేయడం… వేణుస్వామికి కొత్తేమీ కాదు. సినీ తారల పెళ్లిళ్ల నుంచి రాజకీయ నాయకుల భవిష్యత్తు వరకు ఎన్నో అంచనాలు వేశారు. వాటిలో కొన్ని అక్షరాలా నిజమయ్యాయని అభిమానులు చెబుతారు. మరికొన్ని పూర్తిగా తలకిందులయ్యాయని విమర్శకులు గుర్తు చేస్తారు. అందుకే వేణుస్వామి జోస్యం అంటే నూటికి నూరు శాతం నమ్మేవాళ్లు ఒకవైపు… “చూద్దాం ఏమవుతుందో” అని ఎదురుచూసేవాళ్లు మరోవైపు. విజయాలు, వైఫల్యాలు కలిసి సాగిన ఈ జ్యోతిష్య ప్రయాణంలో ఇప్పుడు ఆయన చూపు దేశ రాజకీయాలను కుదిపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీపై పడింది. వ్యక్తుల జాతకాలు చెప్పడం దాటి, ఒక రాజకీయ ఉద్యమానికే కుండలి వేస్తూ చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. “ఈ పార్టీని అణచాలని చూస్తే ఎదుటివారికే నష్టం… బీజేపీకి కష్టకాలం మొదలవుతుంది” అన్న ఆయన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరదీశాడు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీజేపీని బలవంతంగా అణచివేయాలని చేసే ప్రతి ప్రయత్నం తిరిగి ఆ పార్టీకే అనుకూలంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీకి బలమైన రాజయోగం నడుస్తోందని, అందుకే ప్రజల్లో వేగంగా ఆదరణ పెరుగుతోందని చెప్పారు.

బీజేపీకే ఎక్కువ నష్టమా?

సీజేపీ ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయడం బీజేపీకి రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉందని వేణుస్వామి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే అది ప్రజల్లో మరింత సానుభూతిని తెచ్చిపెడుతుందని అన్నారు. ఈ పరిణామాల ప్రభావం నేరుగా బీజేపీపై పడే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాలకు కూడా ఈ అంశం సవాలుగా మారవచ్చని సూచించారు.

ప్రధాన్‌పై కూడా అంచనా

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవిపై కూడా వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసే పరిస్థితులు ఏర్పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని జోస్యం చెప్పారు. సీజేపీ చేపట్టిన ఉద్యమం త్వరగా చల్లారదని, అక్టోబర్ 31 వరకు పార్టీకి విశేష ప్రజాదరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా మరో రూపంలో ఈ పార్టీ వార్తల్లో నిలుస్తుందని చెప్పారు.

ముందుంది ముసళ్ల పండుగ

సీజేపీలోని కొందరు కీలక నాయకులకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా వేణుస్వామి అన్నారు. అయినప్పటికీ పార్టీ ప్రభావం తగ్గదని, దేశ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. ఉద్యమం చుట్టూ జరుగుతున్న ప్రతి పరిణామం సీజేపీకి మరింత ప్రచారం తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు.

చర్చకు దారితీసిన జోస్యం

వేణుస్వామి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు కారణమయ్యాయి. సీజేపీపై చర్యలు తీసుకుంటే బీజేపీకే రాజకీయంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముందన్న ఆయన వ్యాఖ్యలే ప్రధాన ఆకర్షణగా మారాయి. ఇవి జ్యోతిష్య విశ్లేషణలే అయినప్పటికీ, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న పరిణామాల మధ్య ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

#VenuSwamy #SJP #CockroachJanataParty #BJP #NarendraModi #DharmendraPradhan #PoliticalPrediction #Astrology #IndianPolitics #TrendingNews