గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజ బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీలో చేరగా, ఆయన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వైఎస్ జగన్ నాయకత్వం, ప్రజల పట్ల ఆయన నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలు తమను ఆకట్టుకున్నాయని మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ వేదికగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మండవ గౌతమ్ గతంలో టీడీపీ బూత్ కమిటీ అధ్యక్షుడిగా, సొసైటీ అధ్యక్షుడిగా, పొన్నూరు మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. మండవ లక్ష్మీ నీరజ టీడీపీ మండల అధ్యక్షురాలిగా పనిచేయడంతో పాటు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
#YSRCP #YSJaganMohanReddy #TDP #AndhraPradeshPolitics #GunturPolitics #Ponnur #MandavaGautham #MandavaLakshmiNeeraja #PoliticalNews #AndhraPolitics #TeluguDesamParty #YSRCongress #Tadepalli #APNews #JaganMohanReddy #PartyJoining #ElectionPolitics #APPoliticalUpdates #TeluguNews #BreakingNews











