Home Sports_News వైభవ్‌తో పోటీపై సంజూ క్లారిటీ

వైభవ్‌తో పోటీపై సంజూ క్లారిటీ

అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో సంజూ శాంసన్ బ్యాట్ మోగించడంతో పాటు జట్టులో ఓపెనింగ్ స్థానాలపై జరుగుతున్న చర్చకు కూడా గట్టి సమాధానం ఇచ్చాడు. 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే ఛేదించగా, సంజూ–అభిషేక్ శర్మ జోడీ తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించింది. సంజూ కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో ఓపెనింగ్ స్థానం కోసం పోటీపై ప్రశ్నించగా, పోటీ బయటివాళ్లకు మాత్రమేనని సంజూ స్పష్టం చేశాడు. “వైభవ్, అభిషేక్ నాకు పోటీదారులు కాదు.. మేమంతా ఒకే జట్టు. దేశం కోసం గెలవడమే ముందుగా ఉంటుంది” అని చెప్పాడు. ఒకరికి అవకాశం రాలేదని బాధపడటం, మరొకరికి ఎందుకు ఇచ్చారని ఆలోచించడం జట్టులో ఉండదని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు కనిపించినా వాటిని పెద్దగా పట్టించుకోనని చెప్పిన సంజూ, “మేము రోబోలు కాదు.. బయట మాటలు ప్రభావం చూపుతాయి” అంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు. అయితే వాటిని అధిగమించి ఆటపై దృష్టి పెట్టడమే కీలకమని చెప్పాడు. ఇదిలా ఉంటే చివరి టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కే అవకాశాలపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి పెంచుతున్నాయి.

 

#SanjuSamson #VaibhavSuryavanshi #AbhishekSharma #IndiaVsAfghanistan #SanjuSamson57 #T20Cricket #IndianCricket #TeamIndia #SanjuSamsonNews #VaibhavSuryavanshiNews #OpeningPair #ShreyasIyer #CricketNews #T20I #TeamIndiaNews