Home Telangana కేటీఆర్‌కి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్?

కేటీఆర్‌కి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్?

నిజాం కంటే కేసీఆర్ ఫ్యామిలీయే రిచ్ .
జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల ప్రశ్నలు.

రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లో భూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ కుటుంబ ఆస్తులు హైదరాబాద్ నిజాం ఆస్తుల కంటే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. 2004లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పేర్లలో ఉన్న ఆస్తులతో పోలిస్తే ఇప్పుడు భారీగా ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సమీపంలోని 300 ఎకరాల అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేయకుండా ఆక్రమించేందుకు ప్రయత్నించారని చామల ఆరోపించారు. అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్ ఉందని, దాని చుట్టూ గతంలో పలు రాజకీయ వివాదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.

111 జీవో భూములపై విచారణకు డిమాండ్
నీటి వనరుల పరిరక్షణ కోసం అమల్లో ఉన్న 111 జీవో పరిధిలో హరీశ్‌రావు ఫామ్‌హౌస్ ఉందని చామల ఆరోపించారు. జన్వాడ ఫామ్‌హౌస్ నిర్మాణం, నాలా ఆక్రమణపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. కేటీఆర్ స్నేహితుడు ప్రదీప్‌రెడ్డికి భూములు ఎలా వచ్చాయో విచారణ జరపాలని కోరారు. ఫామ్‌హౌస్ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా, భూముల యాజమాన్యం ఎలా మారిందన్న అంశాలపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జన్వాడ ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి అది కేటీఆర్ సొంత ఆస్తి కాదని, తనదేనని వెల్లడించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

 

#ChamalaKiranKumarReddy #KTR #KCR #HarishRao #JanwadaFarmhouse #PradeepReddy #Aziznagar #GO111 #KCRFamily #LandRow #PropertyControversy #TelanganaCongress #BRS #TelanganaPolitics #FarmhouseRow