Home Telangana ఖైరతాబాద్‌లో ఎవరిది పైచేయి?

ఖైరతాబాద్‌లో ఎవరిది పైచేయి?

ఉపఎన్నికతో గ్రేటర్‌లో నయా జోష్

ఖైరతాబాద్‌ ఉపఎన్నిక.. ఒక సీటు కోసం జరిగే పోరా? లేక హైదరాబాద్‌ రాజకీయాల్లో రాబోయే పెను మార్పులకు ఇది తొలి సంకేతమా? ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఈ గడ్డపై 2014లో బీజేపీ జెండా ఎగిరింది.. 2018, 2023లో బీఆర్ఎస్‌ హవా కొనసాగింది.. ఇప్పుడు అదే బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ శిబిరంలో నిలబడి తిరిగి అదే ప్రజల తీర్పును కోరుతున్నారు. మరోవైపు పీజేఆర్‌ కుటుంబ వారసత్వాన్ని ముందుకు తెచ్చే విష్ణువర్ధన్‌రెడ్డి పేరు బీఆర్ఎస్‌ శిబిరంలో చర్చకు వస్తుండగా.. 2014 గెలుపు జ్ఞాపకంతో బీజేపీ చింతల రామచంద్రారెడ్డిని మరోసారి రంగంలోకి దింపే ఆలోచనలో ఉంది. ఇంతలో కవిత కొత్త టీఆర్ఎస్‌ అడుగుపెడితే? జెన్‌జీ శక్తులు రంగ ప్రవేశం చేస్తే.. ఓట్ల చీలిక ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? గతంలో జూబ్లీహిల్స్‌లో తన అంచనాలు ఫలితాలకు దగ్గరగా ఉన్నాయని చెబుతున్న పీసీఎస్‌.. ఖైరతాబాద్‌లో గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌ 43, బీజేపీ 32, బీఆర్ఎస్‌ 26 శాతం ఓట్లతో ఉంటుందని అంచనా వేసింది. అయితే అది తొమ్మిది నెలల నాటి లెక్క.. అప్పటి నుంచి రాజకీయ సమీకరణాలు ఎన్నో మారాయి. ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది.. దానం రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరిగింది.. బీఆర్ఎస్‌ అభ్యర్థి ఇంకా తేలలేదు.. బీజేపీ వ్యూహం పదునెక్కుతోంది. మరి కొత్త సర్వే ఏం చెబుతుంది? ఉపఎన్నిక ముందా.. గ్రేటర్‌ వార్‌ ముందా? ఖైరతాబాద్‌ తీర్పు.. గ్రేటర్‌ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందా? అసలు ఆట ఎక్కడ మొదలవుతుంది?

 

#Khairatabad #KhairatabadBypoll #KhairatabadByElection #DanamNagender #BRS #Congress #BJP #VishnuvardhanReddy #ChintalaRamachandraReddy #TelanganaPolitics #HyderabadPolitics #GreaterHyderabad #TelanganaBypoll #DanamNagenderDisqualification #PoliticalBattle