కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం కేసు
నాంపల్లి కోర్టులో హరీశ్ రావు వాంగ్మూలం
బ్లాక్ మ్యాజిక్ చేశారంటూ తనపై కాంగ్రెస్ నేతలు బి. మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తాను దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను కోర్టు స్వీకరించిన నేపథ్యంలో గురువారం హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ నెల 30న మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ వాంగ్మూలాలను కోర్టు నమోదు చేయనుంది. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని హరీశ్‌రావు పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ హామీలు, ప్రజా సమస్యలపై వస్తున్న ప్రశ్నల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీ ప్రివిలేజ్ ఫిర్యాదులపై చర్యలు లేకపోవడాన్ని, అసెంబ్లీ ఏర్పాటై 33 నెలలు గడిచినా డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడాన్ని ప్రశ్నించారు.











