Home Telangana సీఈసీని అరెస్ట్ చేయాలి బెంగాల్‌లో రీపోలింగ్ పెట్టాలి

సీఈసీని అరెస్ట్ చేయాలి బెంగాల్‌లో రీపోలింగ్ పెట్టాలి

కేంద్రానికి మమత బెనర్జీ డిమాండ్.

పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితా సవరణపై వివాదం ముదురుతోంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న మీడియా కథనం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాత ఓటర్ల జాబితాతో బెంగాల్‌లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్‌ సీఈసీగా కొనసాగినంతకాలం దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు. ఈ అంశంపై ఇండియా కూటమి నేతలు త్వరలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారని తెలిపారు.

30 లక్షల పేర్ల తొలగింపుపై ఆరోపణలు

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ కూడా ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు. బెంగాల్‌ ఓటర్ల జాబితా నుంచి 30 లక్షల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు హర్యానా, బిహార్‌లోనూ జరిగాయని పేర్కొంటూ సీఈసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇవన్నీ టీఎంసీ నేతలు చేసిన ఆరోపణలేనని గమనించాలి. ఇదే సమయంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి కొన్ని ఆపరేషనల్‌ అంశాలు, సూచనలు చేశారని ఎన్నికల సంఘం వెల్లడించింది.

#MamataBanerjee #GyaneshKumar #WestBengalSIR #SIR2026 #ElectionCommission #CEC #WestBengalElections #Repoll #VoterList #ElectoralRoll #SukhbirSinghSandhu #VivekJoshi #TMC #WestBengalPolitics #ElectionNews