ప్రభుత్వం ఎందుకు కప్పిపుచ్చుతోంది.
కూటమిపై విరుచుకుపడ్డ సజ్జల.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం మాత్రం అంతా సక్రమమేనని చెబుతోందని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్, జాబితా మార్పులు, ఫేక్ సర్టిఫికెట్లు, టెట్ అర్హతలు లేని వారికి అవకాశాలు వంటి అంశాలపై సమగ్ర విచారణ అవసరమన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీకి హాజరైన సుమారు మూడున్నర లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశమని స్పష్టం చేశారు.
నిరసనల అడ్డుకట్టపై తీవ్ర ఆరోపణలు
శాంతియుత నిరసనకు వెళ్లిన వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకోవడం, పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం ద్వారా అసలు సమస్యను పక్కదారి పట్టించలేరని సజ్జల అన్నారు. ఏడు దశల వెరిఫికేషన్ జరిగిందంటే ప్రతి అభ్యర్థి అర్హత, సర్టిఫికెట్, ఎంపిక వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ నిబంధనలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై వచ్చిన అనుమానాలపై విచారణ జరగాలని కోరారు. డీఎస్సీ అంశాన్ని ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో కొనసాగిస్తామని, అనర్హుల ఎంపికతో పాటు బాధ్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#DSC2025 #APDSC #SportsQuota #DSCRecruitment #SajjalaRamakrishnaReddy #YSRCP #CBIProbe #SportsQuotaRow #TeacherRecruitment #FakeCertificates #TETEligibility #MeritList #DSCControversy #APPolitics #AndhraPradesh











