గెలుపు గుర్రాలకే అవకాశమన్న బీజేపీ చీఫ్ .
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో సేవాసంకల్ప్ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన.. గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకంపై పార్లమెంట్ స్థాయిలో ఏర్పాటు చేసే సమన్వయ కమిటీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని మాధవ్ పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచే సిద్ధం
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని మాధవ్ పిలుపునిచ్చారు. గుంటూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పును మరింత బలోపేతం చేసేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. కూటమిగానే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు. అవసరమైతే పార్టీ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
#PVNMadhav #BJP #APBJP #LocalBodyElections #APLocalElections #TDP #JanaSena #TDPJanaSenaBJP #AllianceCoordination #CandidateSelection #WinnableCandidates #SeatSharing #APPolitics #AndhraPradesh #APNews











