కౌశిక్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటును బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్వాగతించారు. దానం నాగేందర్‌కు పట్టిన గతే పార్టీ ఫిరాయించిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా ఎదురవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, దానం ఫైటర్ కాదు.. చీటర్ అంటూ విమర్శించారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయమని, ఇది సీఎం రేవంత్‌రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లుగా తాము సాగిస్తున్న పోరాటానికి ఈ తీర్పు ఫలితమని పేర్కొన్నారు. ప్రజలను ఎప్పటికీ మోసం చేయవచ్చని అనుకుంటే కుదరదని, హైకోర్టు బ్రేక్ వేసిందని కౌశిక్‌రెడ్డి అన్నారు. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు పడుతుందని చెప్పారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందినవారో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి, తన పార్టీ మార్పులపై ఎథిక్స్ కమిటీ నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
#PadiKaushikReddy #KaushikReddy #DanamNagender #Khairatabad #DanamDisqualification #BRS #TelanganaHighCourt #KhairatabadBypoll #AntiDefectionLaw #TelanganaPolitics #BRSMLA #TelanganaAssembly #PoliticalControversy #DefectionRow #TelanganaBypoll











