Home Telangana డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది!

డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది!

దానంపై వేటు.. ఉపఎన్నికలో గెలుపు డౌటు!
జోరుమీద కమలం, కారు… హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ బేజారు.
జూబ్లీహిల్స్ రిజల్ట్స్ రావడం కష్టం.. తేడా వస్తే అధికార పార్టీకి తీరని నష్టం.

ఖైరతాబాద్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా భారీ ట్విస్ట్‌.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2023లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన దానం.. 2024లో కాంగ్రెస్‌లో చేరడం, అదే పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికే ఎసరు పెట్టింది. రాజీనామా చేయకపోయినా పార్టీ మారిన తీరు, ఎన్నికల్లో మరో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చర్యలను కోర్టు కీలకంగా పరిగణించింది. మహాచంద్ర ప్రసాద్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన న్యాయసూత్రం కూడా ఈ వ్యవహారంలో ప్రధాన అంశంగా మారింది. స్పీకర్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు.. ఖైరతాబాద్‌ సీటు ఖాళీగా ప్రకటించింది. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. సాధారణంగా సుప్రీంకోర్టు మెట్లెక్కుతారని భావించిన దానం మాత్రం “సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు.. ప్రజాక్షేత్రంలోనే కొట్లాడతా” అంటూ ప్రకటించారు. మరి ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తే దానం మళ్లీ బరిలోకి దిగడం ఖాయమనుకోవాల్సి ఉంటుంది? కాంగ్రెస్‌ ఏ వ్యూహం అనుసరిస్తుంది? బీఆర్‌ఎస్‌, బీజేపీల లెక్కలేంటి? హైకోర్టు తీర్పుతో మొదలైన ఈ ప్రకంపనలు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడికి దారితీయనున్నాయి? అసలు ట్విస్ట్‌ ఇక్కడే ఉంది..

 

#DanamNagender #Khairatabad #KhairatabadBypoll #TelanganaHighCourt #DanamDisqualification #AntiDefectionLaw #BRS #Congress #BJP #TelanganaPolitics #TelanganaBypolls #KhairatabadMLA #TelanganaAssembly #DanamNagenderNews #PoliticalBattle