Home AP తునిలో గంజాయి దందా ఇంటినే అడ్డాగా చేసుకుని రవాణా

తునిలో గంజాయి దందా ఇంటినే అడ్డాగా చేసుకుని రవాణా

125 కేజీల గంజాయి స్వాధీనం.

కాకినాడ జిల్లా తుని పట్టణంలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. సీతారాంపురం ప్రాంతంలోని ఓ ఇంటిని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను తుని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 125 కేజీల గంజాయి, రూ.3.41 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.62.50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇంటి నుంచే గంజాయిని నిల్వ చేసి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల కార్యకలాపాలపై సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.

వాహనాలు సీజ్.. దర్యాప్తు ముమ్మరం

గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక ఎర్టిగా కారు, ఒక ఆటో, రెండు మోటార్‌సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెద్దాపురం డీఎస్పీ తిలక్ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. పట్టుబడిన నలుగురు వ్యక్తుల వెనుక మరెవరైనా ఉన్నారా? గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రవాణా నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

#TuniGanjaRacket #GanjaSeizure #TuniPolice #KakinadaPolice #KakinadaDistrict #125KgGanja #GanjaSmuggling #CannabisSmuggling #GanjaTransport #TuniCrime #APCrimeNews #AndhraPradeshCrime #GanjaCase #KakinadaNews