Home AP ఫ్రీహోల్డ్‌ భూములపై ఫ్రీజ్‌ ఎత్తివేత 9 లక్షల ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ ఊరట

ఫ్రీహోల్డ్‌ భూములపై ఫ్రీజ్‌ ఎత్తివేత 9 లక్షల ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ ఊరట

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్‌ అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. 2024 ఆగస్టు నుంచి నిలిచిపోయిన లావాదేవీలకు తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సిఫారసుల ఆధారంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్టబద్ధంగా ప్రక్రియ పూర్తైన 7,85,500 ఎకరాలు ఇక రిజిస్ట్రేషన్‌కు అందుబాటులోకి రానున్నాయి. CCLA వెబ్‌ల్యాండ్‌ రికార్డులను ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ చేసి ‘పట్టా బై CCLA’గా నమోదు చేయనుంది. దీంతో వేలాది మంది రైతులకు భూములపై ఆర్థిక స్వేచ్ఛ లభించనుంది.

22-ఏ నుంచి అర్హత భూములకు విముక్తి

మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధి వెలుపల అర్హత ఉన్న భూములకు ఫ్రీహోల్డ్‌ హక్కులు మంజూరు చేయడం, 22-A(1) నిషేధిత జాబితా నుంచి తొలగించే అధికారం RDOలు, సబ్‌ కలెక్టర్లకు అప్పగించారు. తప్పుగా అసైన్డ్‌గా నమోదైన 5,422 ఎకరాల ప్రైవేట్‌ పట్టా భూములకు కూడా రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించింది. మరో 64,143 ఎకరాలను ఫ్రీహోల్డ్‌గా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 1973 భూ సంస్కరణల చట్టం కింద సర్‌ప్లస్‌గా ప్రకటించి పంపిణీ చేసిన భూములను కూడా అసైన్డ్‌ భూములతో సమానంగా పరిగణించనున్నారు. అయితే 3,517 ఎకరాల నీటివనరులు, వాటర్‌బాడీ పొరంబోకు భూములు రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉంటాయి. వీటి మార్పిడికి ఇకపై ప్రత్యేక కేబినెట్‌ అనుమతి తప్పనిసరి.

 

#APFreeholdLands #FreeholdLands #AssignedLands #APLandRegistration #AssignedLandRegistration #AndhraPradesh #APRevenueDepartment #CCLA #Webland #PattaByCCLA #22ALands #22AProhibitedLands #LandRecords #LandReforms #FreeholdLand #APFarmers #LandRights #LandTransactions #APGovernment #AndhraPradeshNews #APNews #RevenueDepartment #RDO #SubCollector