Home AP ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయం కొత్త పార్టీకి విజయసాయి శ్రీకారం

ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయం కొత్త పార్టీకి విజయసాయి శ్రీకారం

రేపు మాజీ ఎంపీ నయా పొలిటిక్స్

వైఎస్సార్‌సీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. 2025 జనవరిలో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన ఆయన అప్పట్లో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించినా.. ఇప్పుడు కొత్త రాజకీయ వేదికతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌ 7న రేపు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి కొత్త పార్టీ ఆలోచనను వెల్లడించనున్నారు. ఆ తర్వాత తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో మరో మూడు సమావేశాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలను ప్రస్తావించనున్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ సామాన్య ప్రజల ఆకాంక్షలకు తగిన స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించడం లేదని విజయసాయి అభిప్రాయపడ్డారు.

రెండు కుటుంబాల రాజకీయానికి ప్రత్యామ్నాయం

ఏపీలో రెండు కుటుంబాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యలను కేంద్రంగా చేసుకుని పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజల ఆశలు, అవసరాలకు పూర్తిస్థాయిలో ప్రతినిధ్యం వహించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ద్వారా సామాన్యుడి గొంతుకగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రెండు కుటుంబాల ఆధిపత్యాన్ని తగ్గించి ప్రజల ప్రయోజనాలను కేంద్రంగా చేసుకునే పాలన అందించడమే తన లక్ష్యమని చెప్పారు. విజయసాయి కొత్త పార్టీ ఆవిర్భావంతో ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం చర్చకు వస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. సెప్టెంబర్‌ 7న విజయవాడలో ఆయన వెల్లడించే రాజకీయ కార్యాచరణపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

 

#VijaySaiReddy #VijaySaiReddyNewParty #NewPoliticalParty #AndhraPradeshPolitics #APPolitics #PoliticalAlternative #APThirdAlternative #FamilyPolitics #YSRCP #Vijayawada #Tirupati #Anantapur #Visakhapatnam #FormerMP #APPoliticalNews