Home Telangana హాట్ హాట్ గా సురేఖ వ్యవహారం ఏఐసీసీ చీఫ్‍‌ ఖర్గేతో కొండా భేటీ

హాట్ హాట్ గా సురేఖ వ్యవహారం ఏఐసీసీ చీఫ్‍‌ ఖర్గేతో కొండా భేటీ

కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం వేడెక్కుతున్న వేళ ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బెంగళూరులో భేటీ అయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో తనకు సంబంధించిన వివాదంతో పాటు పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఖర్గేతో అన్ని విషయాలు మాట్లాడినట్లు సురేఖ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, అందుకే నేరుగా ఖర్గేను కలవడానికి బెంగళూరు వెళ్లినట్లు ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో విమానాశ్రయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు సురేఖకు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా తాను బెంగళూరు వెళ్తున్న విషయాన్ని బీజేపీ నేతకు సురేఖ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌లో తనపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖర్గేతో సురేఖ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. తన వాదనను పార్టీ అగ్రనేత దృష్టికి తీసుకెళ్లేందుకు ఆమె ఈ సమావేశాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం నుంచి స్పందన రాకపోవడంతో నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలవడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ అనంతరం సురేఖ తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

 

#KondaSurekha #MallikarjunKharge #Kharge #TelanganaCongress #Congress #KondaSurekhaControversy #TPCC #TelanganaPolitics #CongressLeadership #AICC #NRamchanderRao #KondaSurekhaNews #CongressControversy #TelanganaNews