Home Telangana టి-హబ్‌ వర్సెస్‌ అనుముల హబ్‌ భూకుంభకోణంపై కేటీఆర్‌ ఫైర్‌

టి-హబ్‌ వర్సెస్‌ అనుముల హబ్‌ భూకుంభకోణంపై కేటీఆర్‌ ఫైర్‌


సీఎం సోదరులపై ఆరోపణలు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆయన.. అనుముల కుటుంబం చుట్టూ జరుగుతున్న భూ వ్యవహారాలపై తీవ్ర విమర్శలు చేశారు. నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం టి-హబ్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కుటుంబ ప్రయోజనాల కోసం ‘అనుముల హబ్స్‌’ ఏర్పాటు చేస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టి-హబ్‌ నుంచి అనుముల హబ్స్‌

కేటీఆర్‌ తన విమర్శలను మరింత పదునుగా కొనసాగించారు. అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు.. పెద్దగా పెట్టుబడి లేకుండానే వందల కోట్ల విలువైన భూములు పొందే అవకాశం ఉందన్నట్లుగా వ్యాఖ్యానించారు. ‘టెస్సారాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌’ అనే డిఫెన్స్‌ కంపెనీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, పెట్టుబడి లేకుండా భారీ లాభాలు సాధించినట్లు ఆరోపించారు. దీనిని ‘ఇన్నోవేటర్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు కూడా ఇదే బిజినెస్‌ మోడల్‌ను నేర్పించాలని, ప్రభుత్వ భూములను తక్కువ ధరకు ఎలా పొందాలో శిక్షణ ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు.

రాజకీయంగా ముదురుతున్న భూవివాదం

ప్రభుత్వ భూముల కేటాయింపులు, వాటి విలువపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. గతంలోనే భూముల కేటాయింపులపై కేటీఆర్‌ పలు ప్రశ్నలు లేవనెత్తగా, కాంగ్రెస్‌ నేతలు నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని స్పష్టం చేస్తున్నారు. తాజా ఆరోపణలపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి వివరణ రావాల్సి ఉంది. అయితే కేటీఆర్‌ మాత్రం సోషల్‌ మీడియా వేదికగా వరుస పోస్టులతో రేవంత్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. భూముల వ్యవహారంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతోంది.

 

#KTR #KTRAllegations #RevanthReddy #AnumulaFamily #TelanganaLandScam #LandScam #THub #AnumulaHubs #Tesseract #LandAllotment #BRS #Congress #TelanganaPolitics #RevanthReddyGovernment #GovernmentLand #TelanganaNews