యువత చుట్టూ 2029 రాజకీయం.
12 ఏళ్ల తర్వాత జనసేనకు ‘జైకొట్టు’.
జెన్‌జీ ఆలోచన వేరు.. పార్టీల లెక్క వేరు.
నిన్నటి ఓటు బ్యాంక్.. నేటి పొలిటికల్ పవర్!
నిన్నటి రాజకీయాల్లో యువత అంటే ఓటు బ్యాంక్. నేటి రాజకీయాల్లో యువత అంటే పవర్ బ్యాంక్. 2029 లక్ష్యంగా పార్టీలు యువత చుట్టూ వ్యూహాలు అల్లుతుంటే.. జెన్‌జీ మాత్రం పార్టీల చుట్టూ తన ప్రశ్నలు తిప్పుతోంది. పార్టీలకు యువత కావాలి.. యువతకు మాత్రం ఉద్యోగం, అవకాశం, భవిష్యత్తుపై భరోసా కావాలి. జనసేన ‘జైకొట్టు’తో యువతను సంస్థాగతంగా సమీకరించాలని చూస్తుంటే.. టీడీపీ ‘యువగళం’తో యువతను రాజకీయ భాగస్వాములుగా మలచాలని ప్రయత్నిస్తోంది. వైసీపీ ఉద్యోగ సమస్యలను ఉద్యమ అస్త్రంగా మలచాలని చూస్తోంది. అధికార పక్షానికి యువత అభివృద్ధి భాగస్వామి అయితే.. ప్రతిపక్షానికి యువత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే శక్తి. కానీ జెన్‌జీ లెక్క మాత్రం వేరు. నినాదం కాదు.. ఫలితం. హామీ కాదు.. అమలు. ప్రచారం కాదు.. ప్రగతి. ఎవరు ఏం చెప్పారు అన్నదానికంటే.. ఎవరు ఏం చేశారు అన్నదే ఈ తరం చూస్తోంది. సోషల్ మీడియా చేతిలో ఉంది. సమాచారం కళ్లముందుంది. ప్రశ్నించే ధైర్యం ఉంది. అందుకే యువతను ఆకట్టుకోవడం పార్టీలకు లక్ష్యం అయితే.. యువత నమ్మకం గెలుచుకోవడం అసలు సవాలు. 2029లో జెండా ఎవరిదో కాదు.. జెన్‌జీ తీర్పు ఎటువైపో అదే అసలు రాజకీయ ట్విస్ట్!
#GenZPolitics #GenZVoters #APPolitics #AndhraPradeshPolitics #2029Elections #YouthPolitics #JanaSena #TDP #YSRCP #JaiKottu #YuvaGalam #YouthPower #YouthVote #AP2029











