Home AP 2027 సెకండ్ పార్ట్‌లో పాదయాత్ర షెడ్యూల్ వెల్లడించిన వైఎస్ జగన్

2027 సెకండ్ పార్ట్‌లో పాదయాత్ర షెడ్యూల్ వెల్లడించిన వైఎస్ జగన్

పాదయాత్ర ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మళ్లీ కదలిక మొదలైంది. ఓటమి తర్వాత స్తబ్దుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌లో జగన్ కొత్త వ్యూహానికి తెరతీశారా? వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ.. ఇంకోవైపు బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులపై జగన్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు.. ఇవన్నీ వైసీపీ రాజకీయ వ్యూహానికి కొత్త దిశను సూచిస్తున్నాయి. స్థానిక ఎన్నికలే కేడర్‌కు అసలైన పరీక్ష అంటూ జగన్ ఇచ్చిన పిలుపు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నంగా కనిపిస్తోంది. సర్పంచ్ నుంచి వార్డు సభ్యుడి వరకు ప్రతి స్థాయిలో పార్టీ బలాన్ని చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. గత పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతూనే.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల నుంచి 2019 వరకు.. గత రాజకీయ అనుభవాలను గుర్తుచేసిన జగన్.. అధికార ఒత్తిళ్లు క్షేత్రస్థాయి మద్దతును ఆపలేవంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

 

#YSJagan #JaganMohanReddy #JaganPadayatra #JaganPadayatra2027 #YSRCP #YSRCP2027 #YSRCPStrategy #APPolitics #AndhraPradeshPolitics #JaganPoliticalStrategy #LocalBodyElections #APLocalElections #YSRCPLocalElections #YSRCPGadre #JaganComeback #GrassrootsPolitics #APVoterList #BCReservations #JaganWelfareSchemes #CoalitionGovernment #PoliticalCampaign #APNews