క్రికెట్ బెట్టింగ్‌లు, జల్సాలకు బానిసై అంతర్రాష్ట్ర దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగ షేక్ ఖజాపీర్ (30)ను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై గతంలో అనంతపురం, కర్ణాటక, అన్నమయ్య జిల్లాల్లో మొత్తం 40కి పైగా కేసులు ఉన్నాయి. చిన్నమండెం వండాడి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడి నుండి ₹6 లక్షల విలువైన 42 గ్రాముల బంగారం, ₹50 వేల వెండి వస్తువులు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
#SheikhKhajapeer #AnnamayyaDistrict #CrimeNews #PoliceArrest #InterstateThief #GoldRecovery #BettingAddiction #CricketBetting #Madanapalle #AndhraPradeshNews #PoliceInvestigation #DheerajKunubilliIPS #BurglaryCase #CrimeAlert #PublicSafety #CCTVAwareness #BreakingNews #ThiefArrested #APPolice #LawAndOrder











