జెన్‌జీ యువత షార్ట్‌కట్ మార్గాల కోసం వెంపర్లాడకుండా అర్థవంతమైన దారిలో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన యువతకు జీవిత పాఠాలు చెప్పారు. త్వరగా గమ్యాన్ని చేరాలనే తొందరలో కొందరు ఫుట్‌బ్రిడ్జ్‌ను ఉపయోగించకుండా రైల్వే పట్టాలు దాటుతారని గుర్తుచేశారు. రైల్వే స్టేషన్లలో కనిపించే హెచ్చరిక బోర్డులు కూడా జీవితానికి విలువైన సందేశాలు ఇస్తాయని అన్నారు. తమ ఆలోచనలను ప్రభావితం చేసే ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందుకు వెళ్లేందుకు మార్గదర్శకత్వం కావాలంటే తాము ఆరాధించే వ్యక్తుల ఆత్మకథలు చదవాలని చెప్పారు. యువతతో అనుసంధానం పెంచుకునేలా మోదీ సోషల్ మీడియా వినియోగాన్ని కూడా మార్చుకుంటున్నారు. సెల్ఫీ వీడియోలు, యువత భాషను ఉపయోగిస్తూ రీల్స్‌తో పాటు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
#PMModi #GenZ #Youth #NarendraModi #YouthMotivation #NoShortcuts #Success #CareerGuidance #RamNathKovind #Autobiography #SocialMedia #Influencers #Reels #YouthDevelopment #India











