Home General విద్యార్థులందరికీ 2 జతలు యూనిఫార్మ్‌ల నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలన్న సీఎస్

విద్యార్థులందరికీ 2 జతలు యూనిఫార్మ్‌ల నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలన్న సీఎస్



ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫార్మ్‌లను నెల రోజుల్లోగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యూనిఫార్మ్‌ల తయారీ కోసం 26 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించినట్లు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, విద్యార్థుల నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఫామ్‌పాండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు.

 

#Telangana #SchoolUniforms #GovernmentSchools #ResidentialSchools #SanjayJaju #Education #Students #SelfHelpGroups #SHGWomen #TelanganaNews