అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (24) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో ఈ నెల 18న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి జులై 23న పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు బెడ్‌పైనే వేడుకలు నిర్వహించారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి విషమించి కన్నుమూశాడు. ఎమ్మెస్ కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నిత్యానంద ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
#Telangana #Nirmal #USAccident #Detroit #Michigan #IndianStudent #RoadAccident #NityanandReddy #TelanganaNews #IndianAbroad











