Home Cinema_News పొలిమేర`3 లో అర్జున్ | Arjun Sara

పొలిమేర`3 లో అర్జున్ | Arjun Sara

Arjun Sara

నాదేశం (సినిమా) : టాలీవుడ్‌లో హారర్, మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ’పొలిమేర’ ఫ్రాంచైజీ ఇప్ప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఓటీటీలో సంచలన విజయాన్ని నమోదు చేయగా, రెండో భాగం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్ప్పుడు ’పొలిమేర 3’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న వేళ, చిత్రబృందం ప్రకటించిన తాజా అప్‌డేట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మూడో భాగంలో సీనియర్ నటుడు, ’యాక్షన్ కింగ’ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్జున్ ఎంట్రీతో ’పొలిమేర 3’ కథ మరింత విస్తృతంగా, భారీ స్థాయిలో ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హారర్, మిస్టరీతో పాటు యాక్షన్ అంశాలు కూడా ఈసారి మరింత బలంగా ఉండనున్నాయనే చర్చ సాగుతోంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ’మా ఊరి పొలిమేర’ ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యంలో మంత్రతంత్రాలు, చేతబడులు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమాతో హాస్యనటుడు సత్యం రాజేష్ పూర్తి స్థాయి హీరోగా, నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటన, కథలోని ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మొదటి భాగం విజయంతో ఉత్సాహంగా రెండో భాగాన్ని థియేటర్ల కోసం భారీ స్థాయిలో రూపొందించారు. ’పొలిమేర 2’ విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. మిస్టరీ, హారర్, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.ఇప్ప్పుడు మూడో భాగం గత రెండు చిత్రాల కంటే మరింత భారీ స్థాయిలో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ’బ్లాస్ట’ చిత్రంతో అర్జున్ సర్జా మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.