తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ, తెలంగాణలోని చిట్యాల వద్ద కొత్త డ్రై పోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని ఫతేపూర్ డ్రై పోర్టుకు ఇప్పటికే ఆమోదం లభించినట్లు తెలిపింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ వివరాలు వెల్లడించారు. డ్రై పోర్టుల ద్వారా ఎగుమతి–దిగుమతి రవాణా వేగవంతమై, లాజిస్టిక్స్ వ్యయం తగ్గి, పరిశ్రమలకు ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
#DryPorts #AndhraPradesh #Telangana #SriCity #Chityal #Logistics #IndustrialDevelopment #Exports #Imports #Infrastructure











