అనపర్తి గర్ల్స్ హైస్కూల్, బాయ్స్ హైస్కూల్, రామవరం హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) కార్యక్రమాలకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. నాణ్యమైన విద్య అందించాలంటే పాఠశాల, కుటుంబం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
#NallamilliManojReddy #MegaPTM #ParentTeacherMeeting #Anaparthi #Ramavaram #Education #Students #Teachers #Parents #SchoolEducation #TDP #AndhraPradesh











