అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి నాయకత్వంలో కార్యకలాపాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో బలమైన పట్టు కలిగిన నల్లమిల్లి కుటుంబానికి రోజురోజుకీ ప్రజల మద్దతు పెరుగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన మనోజ్ రెడ్డి గ్రామాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో కుతుకులూరు గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అనపాలమ్మ గుడి కమిటీ చైర్మన్, రెడ్డి సంఘం అధ్యక్షుడు పి.వి.వి.ఎస్.ఎన్. రెడ్డి, కొవ్వూరి సుబ్బారెడ్డి, కొవ్వూరి రవిచంద్రరెడ్డి, శిరివిశెట్టి శ్రీరామకృష్ణ, కర్రి దిలీప్ రెడ్డితో పాటు మరికొందరు నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కొత్తగా చేరిన నాయకులకు స్వాగతం పలికిన మనోజ్ రెడ్డి, పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
#NallamilliManojReddy #TDP #Anaparthi #Kutukuluru #YSRCP #PoliticalJoins #AndhraPradeshPolitics #TeluguDesamParty #PartyStrengthening #LocalPolitics











