మంచినీళ్లు ఇవ్వలేదని ఘోరం. కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు!

46

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో కేవలం మంచినీళ్లు ఇవ్వడం ఆలస్యమైందనే కోపంతో కన్నతల్లిని కొట్టి చంపిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఫ్రిజ్ లోని చల్లటి నీళ్లు తీసుకురావడానికి కాస్త సమయం పట్టిందనే చిన్న కారణంతో రాజబాబు అనే యువకుడు తన తల్లి పెంటా నాగమణి (45) పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. పూజా గదిలోని చెక్క బల్లకు ఆమె తలను బలంగా బాదాడు. ఈ ఘోర దాడిలో తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయిన నాగమణిని కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె ఆదివారం రోజున మరణించింది. ఈ ఘోర కలకలంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడైన కొడుకు రాజబాబుపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

#Kakinada #Pithapuram #ChitradaVillage #CrimeNews #MotherMurder #FamilyTragedy #AndhraPradesh #KakinadaCrime #Rajababu #Nagamani #DomesticViolence #ShockingIncident #AndhraNews #PoliceInvestigation #BreakingNews #HumanityLost #MotherAndSon #MurderCase #TeluguNews #CrimeAlert