Home General ‘నీట్’ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ వినోద్ కుమార్

‘నీట్’ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ వినోద్ కుమార్

41

చీరాల,జూన్ 21 (నాదేశం) : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ‘నీట్’ పరీక్ష ఆదివారం బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలో అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ సందర్భంగా చీరాల పట్టణంలోని శ్రీ నూనె రంగనాయకులు & పానకాలు పురపాలక ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన ‘నీట్’ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో విద్యుద్దీకరణ, తాగునీటి సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట చీరాల ఆర్డీఓ నరసింగరావు, మున్సిపల్ కమిషనర్ డెయిల్ జోసఫ్, తహశీల్దార్ గోపికృష్ణ, చీరాల డి.ఎస్.పి. మోయిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.

 

#NEET2026 #NEETExam #NEETUG #Chirala #BapatlaDistrict #DistrictCollector #VinodKumar #MedicalEntranceExam #NEETExamCenter #EducationNews #StudentLife #ExamUpdates #NationalTestingAgency #NTA #ExamSecurity #SchoolEducation #ChiralaNews #AndhraPradesh #APNews #CompetitiveExams #MedicalStudents #ExamDay #TransparentExams #PublicEducation #GovernmentSchools #ExamManagement #BreakingNews #LatestNews #StudentSuccess #EducationUpdate