ఆకస్మిక మరణం.. ఆలోచించాల్సిన తరుణం
ఆళ్ల నాని మృతి.. గుండెపై కొత్త చర్చ
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆకస్మిక మృతి ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది.. గుండెపోటు నిజంగా ఎప్పుడు వస్తుంది? కనిపించడానికి ఆరోగ్యంగానే ఉన్న మనిషి.. రాత్రి నిద్ర మధ్యలో ఒక్కసారిగా లేచిపోవడం, కడుపులో విపరీతమైన ఉబ్బరం, గ్యాస్, నోటి దుర్వాసన, పగటిపూట నిస్సత్తువ, నిద్రలేమి.. ఇవన్నీ సాధారణ సమస్యలేనా? లేక శరీరం ఏదో హెచ్చరిక చేస్తోందా? వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావాలపై సోషల్ మీడియాలో సాగుతున్న చర్చలకు అసలు వైద్య ఆధారాలేంటి? మరోవైపు.. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 25 ఏళ్లు.. 35 ఏళ్లు.. 45 ఏళ్లు.. వయసు ఏదైనా.. ఒక్క క్షణం చాలు! ఛాతీలో స్వల్ప అసౌకర్యాన్ని గ్యాస్‌గా భావించడం, అలసటను నిర్లక్ష్యం చేయడం, రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్‌ను పట్టించుకోకపోవడం ఎంతటి ప్రమాదానికి దారితీయొచ్చు? అసలు గుండెపోటుకు దారితీసే నిజమైన కారణాలేంటి? ఏ లక్షణాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుర్తించాలి? ఆళ్ల నాని ఆకస్మిక మృతి నేపథ్యంలో మొదలైన ఈ చర్చ.. ప్రతి ఇంటి గుండె తలుపు తడుతోంది.











