Home Sports_News లండన్‌లో షిండేతో కోహ్లీ భేటీ

లండన్‌లో షిండేతో కోహ్లీ భేటీ

క్రికెట్‌ భవిష్యత్‌ వరకు సాగిన మాటామంతీ.

లండన్‌లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేను మర్యాదపూర్వకంగా కలిశాడు. క్రీడలు, మౌలిక వసతులు, యువతకు అవకాశాలు, మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. కోహ్లీని ఎంతో సాదాసీదా వ్యక్తిగా అభివర్ణించిన షిండే.. యువత ప్రతిభను వెలికి తీసి పోటీల్లో రాణించేలా చేయాల్సిన అవసరంపై ఇద్దరం ఆలోచనలు పంచుకున్నామని తెలిపారు. మహారాష్ట్రలో చేపడుతున్న అటల్‌ సేతు, సమృద్ధి మహామార్గ్‌, కోస్టల్‌ రోడ్‌, మెట్రో, థర్డ్‌ ముంబై వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి కోహ్లీకి వివరించినట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై కోహ్లీ సానుకూలంగా స్పందించాడని షిండే వెల్లడించారు. మరోవైపు బ్యాట్‌తో విరాట్‌ దూకుడు కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది వన్డేల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 384 పరుగులు చేసిన కోహ్లీ.. 64 సగటుతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ కెరీర్‌లో 85 సెంచరీలతో ఉన్న విరాట్‌.. 100 శతకాల మైలురాయిపై కన్నేశాడు. సెప్టెంబర్‌ 27 నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేలు అతడి వేటకు మరో వేదిక కానున్నాయి. అంతేకాదు, వన్డేల్లో 14,941 పరుగులతో ఉన్న కోహ్లీ.. మరో 59 పరుగులు చేస్తే 15 వేల పరుగుల క్లబ్‌లో చేరనున్నాడు.

#ViratKohli #EknathShinde #ViratKohliEknathShinde #KohliShindeMeeting #ViratKohliLondon #EknathShindeLondon #ViratKohliNews #TeamIndia #IndianCricket #ViratKohli100Centuries #ViratKohli15000Runs #ODICricket #ViratKohliODI #MaharashtraDevelopment #YouthSports #CricketNews #IndiaCricket