మొండి రిపేర్లకు మాస్టర్.. రాజేశ్వరరావు!

Mastering Every Repair

ప్రెస్టేజ్ సేవల్లో రాజేశ్వరరావు ప్రత్యేక ముద్ర

ఏదైనా పని చేయాలంటే ముందు సంకల్పం ఉండాలి. పని చేయడం ఒక ఎత్తయితే.. ఆ పనికి బాధ్యతగా స్పందించడం మరో ఎత్తు. కొందరికి పని కేవలం ఉపాధి మాత్రమే. మరికొందరికి అదే బాధ్యత.. అదే గుర్తింపు. ఇంకొందరు పనినే దైవంగా భావిస్తారు. అలాంటి వారే తమ రంగంలో ప్రత్యేక ముద్ర వేస్తారు. ఈ కోవలోకి వచ్చే వ్యక్తే రాజేశ్వరరావు. పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన ఆయన సాంకేతిక పరిజ్ఞానాన్ని తన వృత్తికి బలంగా మార్చుకున్నారు. నేర్చుకున్న విద్యకు అనుభవాన్ని జోడించి నైపుణ్యంతో ముందుకు సాగుతున్నారు.

ప్రెస్టేజ్ బ్రాండ్‌తో ప్రత్యేక గుర్తింపు

ప్రముఖ గృహోపకరణాల బ్రాండ్ ప్రెస్టేజ్కు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తూ రాజేశ్వరరావు తనదైన సత్తా చాటుతున్నారు. గృహోపకరణాల విక్రయాలకే పరిమితం కాకుండా వాటి సర్వీసింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయన ప్రత్యేకత. చిన్న సమస్య నుంచి మొండి రిపేర్ వరకు పరిష్కారం చూపడంలో మంచి పట్టు సాధించారు. ఏ వస్తువు తీసుకొచ్చినా సమస్యను గుర్తించడం.. సాధ్యమైనంత త్వరగా రిపేర్ పూర్తి చేయడం శ్రీనగర్ బ్రాంచ్ ప్రత్యేకతగా నిలుస్తోంది.

రిపేర్ తెచ్చుకోండి.. చిటికెలో పరిష్కారం

ప్రెస్టేజ్ పేరుకు తగ్గ సేవలు అందించాలన్నదే రాజేశ్వరరావు లక్ష్యం. కస్టమర్ సమస్యను ఓపికగా తెలుసుకోవడం.. లోపాన్ని గుర్తించడం.. రిపేర్ పూర్తి చేసి తిరిగి అందించడం వరకు ప్రతి దశలో బాధ్యత కనిపిస్తుంది. ఎంత మొండి రిపేర్ అయినా పరిష్కారం వెతకడమే ఆయన పని తీరు. “రిపేర్ తెచ్చుకోండి.. పరిష్కారం తీసుకెళ్లండి” అన్నట్టుగా శ్రీనగర్ కాలనీ బ్రాంచ్ సేవలు సాగుతున్నాయి. పనిపై ప్రేమ, సాంకేతిక నైపుణ్యం, కస్టమర్‌కు వేగంగా స్పందించే తీరు రాజేశ్వరరావును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. పని పట్ల అంకితభావం ఉంటే సాధారణ వృత్తిలోనూ అసాధారణ గుర్తింపు సాధించవచ్చని ఆయన ప్రస్థానం నిరూపిస్తోంది.