డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిబిరంపై దాడికి బోండా ఉమానే బాధ్యుడని ఆరోపించారు. కృష్ణా జిల్లా పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నిర్వహిస్తున్న నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉన్నారనే కనీస గౌరవం లేకుండా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని విమర్శించారు. దీక్షా శిబిరం వద్ద అసభ్యకర చర్యలకు కూడా దిగారని మండిపడ్డారు. మల్లాది విష్ణు అమాయకుడు కాబట్టే ఆయన శిబిరంపై దాడి చేశారని, నిజంగా ధైర్యం ఉంటే కృష్ణలంకలో జరుగుతున్న మరో నిరసన శిబిరం వద్దకు ఎందుకు వెళ్లలేదని బోండా ఉమాను ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం శాంతియుతంగా నిరసన చేపడుతుంటే గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌తో దాడులు చేయడం దారుణమని అన్నారు. బెదిరింపులకు భయపడేది ఎవరూ లేరని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటం కొనసాగుతుందని పేర్ని నాని స్పష్టం చేశారు.
#PerniNani #BondaUma #DSCProtests #DSCRecruitment #DSCIrregularities #YSRCP #TDP #MalladiVishnu #AndhraPradeshPolitics #ProtestAttack #DSCControversy #APPolitics #PoliticalRow #PerniNaniWarning











