Home AP గణేశ్ మండపాలకు లోకేశ్ భరోసా

గణేశ్ మండపాలకు లోకేశ్ భరోసా

Lokesh Assures Support for Ganesh Celebrations

వినాయక వ్రతకల్పం ఆవిష్కరణ.. ఉచిత విద్యుత్తుపై హామీ

ఆంధ్రప్రదేశ్‌లో గణేశ్‌ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యుల కోరిక మేరకు ‘శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పము’ పుస్తకాన్ని లోకేశ్‌ ఆవిష్కరించారు. విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ పులిపాక చంద్రశేఖర్‌ శర్మ సిద్ధాంతి ఈ వ్రతకల్పాన్ని సంకలనం చేశారు. అనంతరం సమితి ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో గణేశ్‌ మండపాల్లో భక్తులతో వరుణ మంత్రం పఠించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన లోకేశ్‌.. గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఉత్సవాల నిర్వహణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. వ్రతకల్పం రూపొందించిన సిద్ధాంతి, గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యులను లోకేశ్‌ అభినందించారు.