జనం తిరుగుబాటుతో దాయాది షాక్.
ఇక చాలు.. మా బతుకు మేం బతుకుతాం.
స్వతంత్ర్యం కోసం పీఓకే ప్రజల పోరాటం .
రగులుతున్న ఆక్రమిత కశ్మీరం.
రక్తంతో రాసిన పాలనపై పోరుబాట .
అణచివేతకు ఎదురొడ్డి ప్రజల పోరాటం.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్.. పీవోకేలో ప్రజల జీవితాలు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి. తాజాగా కాల్పుల్లో ఆరుగురు కశ్మీరులు మృతి చెందడంతో అక్కడ పోరాటం మరో షేప్ తీసుకుంటోంది. రాజకీయ హక్కుల నిరాకరణ, ప్రజా ఉద్యమాల అణచివేత, భద్రతా బలగాల కాల్పులు, భారీ అరెస్టులు, ఇంటర్నెట్ ఆంక్షలు, ఆహారం–మందుల కొరత వంటి సమస్యలు అక్కడి ప్రజలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టినట్లు అనేక నివేదికలు, స్థానిక వర్గాల ఆరోపణలు సూచిస్తున్నాయి. ప్రజల డిమాండ్లకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం బలప్రయోగంతో స్పందిస్తోందని ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మౌలిక హక్కుల కోసం ప్రజలు వీధుల్లోకి వస్తుండగా, ప్రతి నిరసనను అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో పీవోకే అంశం అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు వస్తోంది. పాకిస్తాన్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, కొనసాగుతున్న నిరసనలు, మానవతా పరిస్థితులు, భారత్ స్పందన, భవిష్యత్ రాజకీయ ప్రభావాలపై ప్రత్యేక కథనాలు నా దేశం స్పెషల్‌లో











