ఒకప్పుడు చేతిలో బ్యాట్.. ఇప్పుడు గురిపెట్టిన షాట్‌గన్.. ఇదే మైరాజ్ అహ్మద్ ఖాన్ అసాధారణ క్రీడా ప్రయాణం. ఉత్తరప్రదేశ్‌లోని ఖుర్జా నుంచి ప్రపంచ షూటింగ్ రేంజ్‌ల వరకు సాగిన ఈ 50 ఏళ్ల యోధుడి కథలో పట్టుదలే అసలైన విజేత. 1994లో క్రికెట్‌తో మొదలైన ప్రయాణంలో మైరాజ్ యూపీ తరఫున సీకే నాయుడు, వినూ మంకడ్ ట్రోఫీల్లో ఆడాడు. జామియా మిలియా ఇస్లామియాలో ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో యువ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి నెట్స్ పంచుకున్నాడు. అయితే విధి అతడిని మరో క్రీడ వైపు నడిపించింది. చిన్నతనంలో షూటింగ్‌పై ఆసక్తి ఉన్న మైరాజ్.. ఒక జిల్లా స్థాయి పోటీలో గెలిచిన రూ.30తో క్రికెట్ బ్యాట్ కొనుక్కున్నాడు. 1999లో చెన్నైలో రోంజన్ సోధితో జరిగిన స్కీట్ షూట్‌ఆఫ్‌లో విజయం అతడి జీవితాన్ని మలుపుతిప్పింది. అప్పటి నుంచి స్కీట్నే శ్వాసగా మార్చుకున్న మైరాజ్ 2016 రియో ఒలింపిక్స్‌కు షాట్‌గన్ స్కీట్‌లో అర్హత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. రెండు ఒలింపిక్స్, ప్రపంచకప్‌లో స్వర్ణం, రజతం అతడి ఖాతాలో చేరాయి. 2018, 2022 ఆసియా క్రీడల బెర్త్‌లు తృటిలో చేజారినా ఇప్పుడు నాలుగో ఆసియా క్రీడలకు సిద్ధమయ్యాడు. “50 కొత్త 20.. అతనికి జోష్ ఉంటే, నాకు హోష్ ఉంది” అంటూ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి చెప్పిన మైరాజ్.. అనుభవానికి వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించేందుకు గురిపెట్టాడు.
#MairajAhmadKhan #MairajKhan #SkeetShooting #IndianShooting #ShotgunShooting #AsianGames2026 #AsianGames #Olympics #Rio2016 #IndianAthletes #ShootingSports #CricketToShooting #SportsJourney #IndianSports #SportsNews











