గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నారు. నీరజ్ తన సీజన్ బెస్ట్ 85.83 మీటర్ల త్రో నమోదు చేసినప్పటికీ, శ్రీలంక అథ్లెట్ రుమేష్ పతిరాగే 89.75 మీటర్ల అద్భుత త్రోతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరో భారత అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకం సాధించి భారత్‌కు రెండో పతకాన్ని అందించాడు. రోహిత్ యాదవ్ కూడా ఫైనల్లో తొలి ఆరుగురిలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత, పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ ఈ పోటీలో తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు ప్రయత్నాలు ఫౌల్ కాగా, మూడో ప్రయత్నంలో 77.41 మీటర్లు మాత్రమే విసిరి టాప్-8లో చోటు దక్కించుకోలేక మూడు రౌండ్లకే నిష్క్రమించాడు. దీంతో జావెలిన్ ఫైనల్లో అతిపెద్ద సంచలనం నమోదైంది. భారత్ ఒక రజతం, ఒక కాంస్యంతో తన పతకాల ఖాతాను మరింత బలోపేతం చేసుకుంది.
#NeerajChopra #NeerajChopraSilver #YashveerSingh #CommonwealthGames2026 #JavelinThrow #IndiaAtCWG #IndianAthletics #JavelinFinal #IndiaMedals #Glasgow2026 #RumeshaPathirage #ArshadNadeem #Athletics #TeamIndia #CommonwealthGames











