బ్రిక్స్‌తో భారత్‌కు పెరుగుతున్న బలం.
జీ7ను దాటి ప్రబల ఆర్థిక శక్తిగా ఇండియా.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. 20 ఏళ్ల క్రితం నాలుగు దేశాలతో ప్రారంభమైన బ్రిక్స్.. ఇప్పుడు 11 దేశాల బలమైన కూటమిగా ఎదిగింది. భారత్, రష్యా, చైనా, బ్రెజిల్‌తో 2006లో ప్రారంభమైన ఈ సమూహం అప్పట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 20.4 శాతం వాటా కలిగి ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2026 అంచనాల ప్రకారం బ్రిక్స్ దేశాల వాటా ప్రపంచ జీడీపీలో 41 శాతానికి చేరగా.. జీ7 వాటా 28 శాతంగా ఉంది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యంపై కొత్త ప్రశ్నలు వస్తున్న సమయంలో బ్రిక్స్ ప్రభావం పెరగడం కీలక పరిణామంగా మారింది. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు ఈ కూటమి మరింత పెద్ద వేదికగా మారుతోంది.
చైనా తర్వాత భారత్‌దే కీలక స్థానం
బ్రిక్స్ ఆర్థిక బలం ప్రధానంగా చైనా, భారత్ చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. బ్రిక్స్ మొత్తం ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా 48.5 శాతం.. భారత్ వాటా 20.7 శాతం. రష్యా 8.2 శాతం, ఇండోనేషియా 6 శాతం, బ్రెజిల్ 5.7 శాతం, సౌదీ అరేబియా 3.2 శాతం వాటాతో ఉన్నాయి. భారత్ విదేశీ వాణిజ్యంలో కూడా బ్రిక్స్ ప్రాధాన్యం భారీగా పెరిగింది. 2025-26లో భారత ఎగుమతుల్లో బ్రిక్స్ దేశాల వాటా 22 శాతం.. దిగుమతుల్లో ఏకంగా 41 శాతంగా నమోదైంది. చైనా నుంచి దిగుమతులు భారీగా ఉండగా, రష్యా నుంచి చౌక ముడిచమురు కొనుగోళ్లు పెరగడంతో ఇంధన భద్రతలోనూ బ్రిక్స్ ప్రాధాన్యం పెరిగింది. బ్రిక్స్ వాణిజ్యంలో చైనా, యూఏఈ, రష్యా కీలక భాగస్వాములుగా నిలుస్తున్నాయి.
వాణిజ్యంతో పాటు ప్రవాస బలం
బ్రిక్స్ భారత్‌కు వాణిజ్య ప్రయోజనాలకే పరిమితం కాదు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో గణనీయమైన సంఖ్య బ్రిక్స్ దేశాల్లోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.73 కోట్ల ప్రవాస భారతీయుల్లో దాదాపు 89.8 లక్షల మంది బ్రిక్స్ దేశాల్లో నివసిస్తున్నారు. యూఏఈ, సౌదీ అరేబియాలో కలిపి 70 లక్షలకు పైగా భారతీయులు ఉండగా, దక్షిణాఫ్రికాలో సుమారు 18 లక్షల భారతీయ మూలాల ప్రజలు ఉన్నారు. వాణిజ్యం, ఇంధన భద్రత, ప్రవాస భారతీయుల అనుసంధానం, దౌత్య సంబంధాల పరంగా బ్రిక్స్ భారత్‌కు కీలక వేదికగా మారింది. జీ7ను మించి ప్రపంచ ఆర్థిక వాటా సాధించిన బ్రిక్స్.. మారుతున్న ప్రపంచ శక్తి సమీకరణంలో భారత్‌కు వ్యూహాత్మకంగా మరింత పెద్ద వేదికను అందిస్తోంది. సదస్సు ద్వారా భారత్ తన ఆర్థిక, దౌత్య ప్రయోజనాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.
#BRICS #BRICS2026 #BRICSAt20 #India #NarendraModi #BRICSSummit #BRICSVsG7 #IndianEconomy #GlobalSouth #IndiaTrade #IndiaRussia #IndiaChina #GlobalPowerShift #IndiaForeignPolicy










