భారత హాకీ జట్టు కాషాయ జెర్సీ వివాదంపై మాజీ దిగ్గజ ఆటగాడు ధన్‌రాజ్ పిళ్లై స్పందించారు. దశాబ్దాలుగా నీలం జెర్సీయే భారత హాకీకి గుర్తింపుగా నిలిచిందని అన్నారు. 1928 ఒలింపిక్స్ నుంచి ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్, మహ్మద్ షాహిద్, తన తరం వరకు అందరూ నీలం జెర్సీలోనే దేశానికి ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. బ్లూ ఆస్ట్రోటర్ఫ్ కారణంగా జెర్సీ రంగు మార్చాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ, క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికారు.
#DhanrajPillay #IndianHockey #IndiaHockeyTeam #BlueJersey #SaffronJersey #HockeyJersey #Hockey #PargatSingh #DhyanChand #BalbirSingh #MohammedShahid #IndianSports #HockeyNews #SportsNews #IndiaSports #KeepSportsOutOfPolitics #IndianHockeyHistory











