భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన గ్రెగ్ చాపెల్-సౌరవ్ గంగూలీ ఎపిసోడ్‌పై ‘దాదా’ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. 2000వ దశకం మధ్యలో తనను జట్టు నుండి తప్పించడంలో కీలక పాత్ర పోషించిన చాపెల్, ఆ తర్వాత ఒక ఐపీఎల్ సీజన్ కోసం తనను సంప్రదించారని గంగూలీ వెల్లడించారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో గంగూలీ మాట్లాడుతూ.. “నేను కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, 2011లో గ్రెగ్ చాపెల్ నుండి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. నేను కెప్టెన్‌గా ఉంటే, ఆయన కేకేఆర్ జట్టుకు కోచ్‌గా పనిచేయాలని అనుకుంటున్నట్లు అందులో రాశారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను” అని పేర్కొన్నారు. అయితే ఆ మెయిల్‌కు తాను ఎలాంటి సమాధానం ఇవ్వలేదని గంగూలీ స్పష్టం చేశారు. నిజాయితీ లేని వ్యక్తులకు తాను జవాబు ఇవ్వనని, ఒకసారి మోసపోయిన తాను మళ్లీ మూర్ఖుడిలా మారదలచుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ వెల్లడి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
#SouravGanguly #GregChappell #IndianCricket #KKR #IPL #CricketNews #TeamIndia #CricketControversy #GregChappellEmail #Dada #KolkataKnightRiders #Podcast #CricketUpdates #BCCI #IPL2011 #CricketHistory #SportsNews #IndianCricketHistory #CricketHeadlines #GangulyRevelation











